Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 25 నుంచి వీఆర్ఏల నిరవధిక సమ్మె
- పేస్కేలు..ఉద్యోగభద్రత..వారసులకు ఉద్యోగాలే ప్రధాన అజెండా
- నేటి నుంచి 22 వరకు రిలేనిరాహార దీక్షలు
- 23న కలెక్టరేట్ల ముట్టడి
- విడివిడిగా వద్దు..ఐక్యపోరే ముద్దు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'పేస్కేలు ఇస్తాం...ఉద్యోగ భద్రత కల్పిస్తాం..అర్హులైన వారసులకు ఉద్యోగాలిస్తాం' అని సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా 2020 సెప్టెంబర్లో హామీనిచ్చారు. సొంతూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని కూడా చెప్పారు. ఇది చెప్పి ఐదేండ్లు దాటింది. ఇదిగో..అదిగో...అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం దగ్గర పరపతి ఉన్న రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పే మాటలన్నింటినీ నమ్ముతూ పోయారు. హామీనిచ్చినప్పుడల్లా ఇక తమ జీవితాలు బాగుపడ్డట్టే అనే సంతోషాన్ని తట్టుకోలేక పాలాభిషేకాలూ చేశారు. ఎవరివారే యమునా తీరే అన్నట్టు విడిపోయి ఎవరికివారే మండలస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తమకి కనిపించిన నేతకల్లా..అధికారికల్లా వినతిపత్రాలిస్తూ తమకిచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాలని వేడుకున్నారు. ప్చ్. ఏం ప్రయోజనం లేకుండా పోయింది. సంఘాలను చీల్చి విభజించు పాలించు అనే సర్కారు ఎత్తుగడ ముందు వారు చిన్నబోయారు. చివరకు విడివిడిగా కొట్లాడితే ఎవ్వరూ పట్టించుకోరనే విషయాన్ని గ్రహించారు. తమలో చిన్నచిన్న వైషమ్యాలున్నా ఐక్యపోరుతో ముందుకు సాగుతేనే మంచిదనే అభిప్రాయానికొ చ్చారు. రిక్రూట్మెంట్వీఆర్ఏలు, వారసత్వ వీఆర్ఏలంతా ఒకతాటిపైకొచ్చి జేఏసీగా సర్కారుపై సమ్మె అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఇప్పుడు ఈ నెల 25 నుంచి సమ్మెలోకి వెళ్లబోతున్నట్టు అల్టిమేటాన్ని ప్రభుత్వానికి జారీ చేశారు. అందులో భాగంగా తమ సమస్యలను ప్రజలకు కూడా అర్థమయ్యేలా వివరిస్తూ ప్రజల, ఆయా పార్టీల విశాల మద్దతు కూడగట్టేదుందకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమ్మెకు సన్మాహకంగా బుధ, గురువారాల్లో జిల్లా కేంద్రాల్లో రిలేనిరాహార దీక్షలు చేపట్టనున్నారు. 23న కలెక్టరేట్లను ముట్టడించాలనే నిర్ణయాన్ని జేఏసీగా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో దాదాపు 23 వేల మందికిపైగా వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో వారసత్వ వీఆర్ఏలు 20 వేలకుపైగా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏలు 3 వేల వరకు ఉన్నారు. వారిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన సామాజిక తరగతుల వారే. అందులోనూ సగానిపైగా వృద్ధులు. ఎక్కువగా చదువురానివారే. వీరంతా రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులకు సహకరిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. తమను పర్మినెంట్ చేయాలని వీఆర్ఏలు ఐదేండ్ల కింద రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేశారు. ఆ సమయంలో వారందర్నీ సీఎం ప్రగతి భవన్కు పిలిపించుకున్నారు. అర్హతగలిన వీఆర్ఏ లందరికీ వాచ్మెన్లు, జీపుడ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా ప్రమోషన్లు కల్పిస్తామనీ, సొంతూరు లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని భరోసా నిచ్చారు. అయితే ఈ విషయంలో ఇంతవరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2020 సెప్టెంబర్లో వీఆర్వో వ్యవస్థ రద్దుపై అసెంబ్లీలో మాట్లాడే సందర్భంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినా...విపత్తులు, అత్యవసర సమాచారాలు అందించేందుకుగానూ ఊరికో వీఆర్ఏను అట్లాగే ఉంచుతామనీ, వారికి పేస్కేలు వర్తింపజేస్తామని హామీనిచ్చారు. వీఆర్ఏలంతా దళితులు, ఇతర వెనుకబడిన సామాజిక తరగతుల వారేననీ, ఖచ్చితంగా న్యాయం చేస్తామని కొండంత భరోసా నిచ్చారు. మినిమం పే స్కేల్ వర్తింప జేసేందుకు రూ.250 కోట్లు అయితే సరిపోతుందని లెక్కలతో సహా వివరించారు. తండ్రుల స్థానంలో వారసులకు ఉద్యోగాలిచ్చే అవకాశాన్నీ పరిశీలిసా మ న్నారు. నెల గడిచింది.. ఆరునెలలు దాటింది.. ఏడాది గడిచి పోయింది... ఏడాదిన్నర అయిపో యింది.. ఇప్పుడు కరెక్టుగా 22 నెలలు అవుతున్నది. అంటే ఇంకో రెండు నెలలైతే సీఎం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీకి రెండేండ్లు. ఒక్కహామీ కూడా పట్టాలెక్క లేదు. ప్రస్తుతం వారికి డీఏలతో కలిపి వేతనం రూ. 10,500కి మించి అందట్లేదు. అదీ రెగ్యులర్గా అందట ం అసాధారణం. కొందరైతే కుటుంబం కోసం చేసిన అప్పులు తీర్చ లేక ఆత్మ హత్యలు చేసుకుం టున్న పరిస్థితి. ఇప్పటికే కామా రెడ్డి జిల్లాలో రమేశ్ అనే వీఆర్ఏ ఆర్థిక సమస్యలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పలుజిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నా యి. నిజామా బాద్ జిల్లా బోధన్ మండలంలో ఓ వీఆర్ఏ ఇసుక మాఫియా చేతిలో హత్యకు గురయిన విషయం విదితమే.
త్వరగా సమస్యలు పరిష్కరించాలి :
వంగూరు రాములు, వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర నాయకులు
వీఆర్ఏ లాంటి క్షేత్రస్థాయి ఉద్యోగులను విస్మరించడం రాష్ట్ర సర్కారుకు మంచిగాదు. సమ్మె లోకి వెళ్లేదాకా పరిస్థితి తీసుకురావొద్దు. రాష్ట్ర సర్కా రు వీలైనంత త్వరగా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి. వారందరికీ పేస్కేలు వర్తింప జేయాలి. తండ్రుల స్థానంలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలి. ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వాలి. అధికారు లకు సొంతసేవలకు వీఆర్ఏలను వాడుకోవద్దని సర్వీస్రూల్లో స్పష్టం గా ఉన్నా అది అమలు కావట్లేదు. 24 గంట లూ పనిచేయించడం దారుణం. వీఆర్ఏలపై అధికారుల వేధింపులు ఆపాలి