Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి నివేదిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో భారీ వర్షాల మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాధమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్రానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్లు వరద నష్టం సంభవించినట్టుగా ఆ నివేదికలో పొందుపరిచింది. ఈ నేపథ్యంలో రూ.1,000 కోట్లను తక్షణ సాయం కింద విడుదల చేయాలని కేంద్రాన్ని... రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వరదల వల్ల కాజ్వేలు, రోడ్లు కొట్టుకపోవడం తదితర కారణాల వల్ల రోడ్లు భవనాల శాఖ కు సంబంధించి రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది. పంచాయితీరాజ్ శాఖలో రూ.449 కోట్లు., ఇరిగేషన్ శాఖ రూ.33 కోట్లు., మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో రూ.379 కోట్లు., విద్యుత్ శాఖలో రూ. 7 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఆయా శాఖలు ప్రాథమిక అంచనాల ద్వారా నివేదికలు సిద్దం చేసి కేంద్రానికి అందజేశాయి. ఇండ్లు కూలిపోవడం, ముంపునకు గురికావడంతో పాటు బాధితులను తరలించే క్రమంలో రూ. 25 కోట్లు, ఇంకా తదితర వరద నష్టాలు వెరసి మొత్తంగా రూ. 1,400 కోట్ల మేర రాష్ట్రంలో వరద నష్టం సంభవించిందని అధికారులు వివరించారు.