Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీలో చట్ట ప్రకారం...కార్మిక సంఘాల కార్యక్రమాలకు అనుమతించాలని కోరుతూ ఈ నెల 23న చలో లేబర్ కమిషనరేట్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీఎస్ఆర్టీసీ జేఏసీ తెలిపింది. బుధవారం హైదరాబాద్లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో జేఏసీ చైర్మెన్ కె.రాజిరెడ్డి అధ్యక్షతన సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ కో కన్వీనర్లు ఎస్.సురేశ్, గుడిసల అబ్రహాము, సాములయ్య (టీజేఎంయూ), పి.రవీందర్ రెడ్డి (ఎస్ డబ్ల్యూఎఫ్), మంగ, బి.జక్రయ్య (ఈయూ), శ్రీనివాస్ గౌడ్ (బీకేయూబీడబ్ల్యూయూ) పాల్గొన్నారు. చలో లేబర్ కమిషనరేట్ కార్యక్రమానికి రాష్ట వ్యాప్తంగా అన్ని డిపోల నుండి పెద్ద ఎత్తున హజరై విజయవంతం చెయాలనీ జెఏసి పిలుపునిచ్చింది. హైదరాబాద్ సిటీలో మెదటీ షిఫ్ట్ డ్యూటీ చేసిన కార్మికులు పెద్ద ఎత్తున హజరై విజయవంతం చేయాలని నాయకులు కోరారు.