Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏరియా జీఎంలకు సింగరేణి సీఎండీ దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారీ వర్షాలు కురిసినా బొగ్గు ఉత్పత్తి ఆగకుండా చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఏరియా జనరల్ మేనేజర్లకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో ఆయన ఏరియా జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐదు రాష్ట్రాల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా సరఫరా చేయాలనీ, తక్షణమే అన్ని ఉపరితల గనుల్లో మరింత పటిష్టమైన హాల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఖర్చుకు వెనకాడకుండా అధిక నీటిని తోడే పంప్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు 1.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.