Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ సబ్‌జూనియర్ ఛాంపియన్ షిప్ విజేతలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్స్‌లో పతకాలు విరివిగా సాధించాలని రాష్ట్ర క్రీడా మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆకాంక్షించారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 23వ జాతీయ సబ్ జూనియర్ ఛాంపియన్ షిప్-2022 లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడా పాఠశాలకు చెందిన క్రీడాకారులు ఆయన్ను కలిశారు. అండర్ 13 బాలుర డబుల్ స్కల్ విభాగంలో రజత పతకాలు సాధించిన ఎన్.అశ్వద్థామగౌడ్, జె.రాకేశ్, అండర్-15 బాలికల డబుల్ స్కల్ విభాగంలో పతకాలు సాధించిన మహాలక్ష్మి, భావన, అండర్ 15 బాలికల ఫోర్స్ విభాగంలో రజత పతకాలను సాధించిన శైలజా, శ్రావ్య, సాయి ప్రసన్నలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ డాక్టర్ హరికృష్ణ, స్పోర్ట్స్ ఆఫీసర్ బోస్, కోచ్‌లు ఇస్మాయిల్, సతీష్, మాజీ జెడ్పీటీసీ వెంకట్ గౌడ్ పాల్గొన్నారు.