Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాజోలి బండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) కుడి కాల్వ పనులపై కష్ణాబోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మెన్‌కు రాష్ట్ర సాగునీటి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మరో లేఖ రాశారు. ఆర్డీఎస్ కుడి కాల్వ పనుల పరిశీలన కోసం ప్రత్యేకంగా బందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. కష్ణా ట్రిబ్యునల్ తీర్పునకు, పునర్విభజన విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పనులు కొనసాగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ కుడి కాల్వ పనులపై నిరసన తెలుపుతూ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కేఆర్ఎంబీ చైర్మెన్‌కు ఈనెల 12న కూడా లేఖ రాసిన సంగతి తెలిసిందే.