Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్, టీబీజేఏ ఖండన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు, టెన్ టీవీ రిపోర్టర్ పి రాధికపై పోలీసులు అనుచితంగా వ్యవహరించడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీబీజేఏ) ప్రధాన కార్యదర్శి వేముల జ్యోతిబసు ఖండించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళనా కార్యక్రమం కవరేజీకి వెళ్లిన రాధికను మహిళా కానిస్టేబుల్ ఉద్దేశ్యపూర్వంగా తోసివేసి అవమానించారని గుర్తు చేశారు. ఛానె ల్ లోగోను లాక్కోవడం, నెట్టివేయడం సరికాదన్నారు. ఈ చర్య వృత్తి బాధ్యతలను నిర్వర్తించకుండా అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించారు. సంబంధిత కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.