Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లను పాఠశాల విద్యాశాఖ నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవసేన బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో వారిని గత రెండు విద్యాసంవత్సరాలుగా విధుల్లోకి తీసుకోలేదు. ఇప్పుడు తిరిగి వారిని నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. క్రాఫ్ట్, ఆర్ట్, పీఈటీలను తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. అంటే రాష్ట్రంలో ప్రభు త్వ పాఠశాలల్లో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశా లల్లో వంద మంది కంటే ఎక్కువ విద్యార్థులుంటే అక్కడ వారిని నియమిస్తారు.