Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో), కోఆర్డినేటర్లు, సమగ్ర శిక్ష డీపీవోలతో గురు, శుక్రవారాల్లో పాఠశాల విద్యాశాఖ సమావేశం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న టీఎస్ఐఆర్డీలో నిర్వహించనుంది. తొలిరోజు గురువారం ఫౌండేషనల్ అండ్ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన ్)పై అవగాహన కార్యక్రమం ఉంటుంది. రెండోరోజు శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవ సేన బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఇందులో పాఠ్యపుస్తకాల పంపిణీ, ఉపాధ్యాయుల సర్దుబాటు, మధ్యాహ్న భోజనం, మొబైల్ యాప్, క్రమశిక్షణ చర్యలు, ఎవరికీ చెప్పకుండా గైర్హాజరయ్యే వారి వివరాలు, కోర్టు కేసులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు, గుర్తింపు పొందని పాఠశాలలు, ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశ పెట్టడం, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రవేశాలు, యూనిఫారాల పంపిణీ స్థితి, మనఊరు-మనబడి కార్యక్రమం, ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమలు చేసే సమగ్ర శిక్ష కార్యక్రమాలు, 2021-22 విద్యాసంవత్సరంలో యూడైస్ స్థితి, విద్యార్థుల ప్రవేశాల తాజా సమాచారం, చైల్డ్ ఇన్ఫో డేటా మెరుగుపర్చడం, బడిబయట ఉండే పిల్లలు, ఒకేషనల్ విద్య వంటి మొత్తం 31 అంశాలపై చర్చిస్తామని వివరించారు.