Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీట్లు కోల్పోనున్న విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సకాలంలో మెడికల్ పీజీ ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు కానుంది. దీంతో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక వైద్యసంస్థల్లో తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం లేకుండా పోయే ప్రమాదం నెలకొన్నది. ఈ ఏడాది మే 23 నుంచి జరిగిన మెడికల్ పీజీ పరీక్షలు ఫలితాలు ఇంకా రాకపోవడంతో విద్యార్థు లు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. పీజీ అనంతరం జాతీయ స్థాయిలో ఎయిమ్స్, జిప్మర్, పీజీఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసేందుకు విద్యార్థులు అవకాశం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు.