Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'కూ' హైద రాబాద్‌లో డెవలప్మెంట్ సెం టర్ను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగా హన ఒప్పందం కుదుర్చు కుంది. నగరం ఒక ఐటి హబ్‌గా ఉండటం, బలమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థతో పాటు ప్రతిభను కలిగి ఉన్న ఈ నగరంలో తమ ఉనికిని గణనీయమైన రీతిలో అభివద్ధి చేయాలని భావిస్తోన్నామని కూ తెలిపింది. ఒప్పంద కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రభావాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సోషల్ మీడియా ఒక ముఖ్యమైన యంత్రాంగమ మన్నారు. కూ సీఈఓ అప్రమేయ రాధాకష్ణ మాట్లాడుతూ భిన్న భాషలు కలిగిన దేశంలో స్థానిక భాషా ఆధారిత సోషల్ మీడియా ఈ సమయంలో అవసరమన్నారు.
26 సంస్థలతో టాస్క్ ఒప్పందాలు
విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) 26 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో ఇప్పటికే భాగస్వాములుగా ఉన్న మరో 27 సంస్థలతోనూ కలిసి పని చేయనున్నది. బుధవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో ఒప్పంద కార్యక్రమం జరిగింది.