Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజీఐ ఎన్వీ రమణకు డాక్టరేట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) 82వ స్నాతకోత్సవం వచ్చేనెల ఐదున నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యఅతిధిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ హాజరు కానున్నారు. వర్సిటీల చాన్సలర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అయితే ఎన్వీ రమణకు ఓయూ డాక్టరేట్‌ను ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ అంశంపై ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రితో ఓయూ వీసీ డి రవీందర్ బుధవారం చర్చించినట్టు తెలిసింది. ఈ స్నాతకోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్డీ, ఎంఫిల్‌తోపాటు పీజీ పట్టాలను అందజేస్తారు. దరఖాస్తు చేసుకునే గడువు బుధవారంతో ముగిసింది.