Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్ల మరమ్మతులకు రూ.12 కోట్లు మంజూరు
- టీఎస్ఆర్డీసీ చైర్మెన్ శ్రీనివాస్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర గవర్నర్ వరద రాజకీయాలను మానుకోవాలని టీఆఎస్ ఆర్డీసీ చైర్మెన్ మెట్టు శ్రీనివాస్ హితవు పలికారు. వరదల నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యటనలు చేయడమేకాదనీ, కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత కూడా తీసుకోవాలని గవర్నర్కు సూచించారు. బుధవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వరదల నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేననీ, వారిని ఎలా ఎదుకోవాలనే విషయాన్ని వదిలేసిన బీజేపీ అధ్యక్షులు బండి సంజరు, గాలి కబుర్లు చెబుతున్నారన్నారు. ఆయనకు దిమాక్ లేదన్నారు. అనవసర వరద, బురద రాజకీయ విమర్శలే తప్ప ప్రజల అభివృద్ధి, సంక్షేమం బీజేపీకి పట్టడం లేదని వ్యాఖ్యానించారు. భద్రాచలం వరద బాధితులకు ప్రధాని మోడీ ఇంతవరకు ఒక్కఫైసా మంజూరు చేయలేదని గుర్తు చేశారు. కేంద్రం, ప్రభుత్వంలా కాకుండా రాజకీయ పార్టీ మాదిరిగానే వ్యవహరిస్తున్నదని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ 2014 నుంచి ఇప్పటిదాకా ఏన్నోమార్లు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి నిధులు కేటాయించాలని వినతిపత్రాలు ఇచ్చినా స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. ఉద్యమనేత కేసీఆర్కు తెలంగా ణను అద్భుతమైనరీతిలో తిర్చి దిద్దుతున్నారని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మత్తుల కోసం టీఎస్ఆర్డీసీ నుంచి రూ.12 కోట్లను మంజూరు చేశామని వివరించారు. విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు, ఢిల్లీ నుంచి నిధులు తేవడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. ప్రజల భావోద్వే గాలతో ఆడుకుంటున్న మోడీ సర్కారుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేసీఆర్ సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు.