Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేస్కేల్ ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన పేస్కేలు, వారసత్వ ఉద్యోగాల హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రక టించారు. ఈ మేరకు బుధవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు హామీనిచ్చి దాదాపు రెండేండ్లు కావస్తున్నా ఒక్కడుగు కూడా ముందుకు పడకపోవటం దారుణమని పేర్కొన్నారు. వీఆర్ఏలు ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నా రాష్ట్ర సర్కారు మొద్దు నిద్రపోతున్నదని విమర్శించారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారి పోరాటానికి కార్మి క వర్గం అండగా నిలవాలనీ, దీక్షల్లో పాల్గొని సంఘీభావం తెలపాలని పిలుపు నిచ్చారు.
సింగరేణి దీక్షల భగం, నాయకుల అరెస్టు దుర్మార్గం
సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు తమ్మల రాజారెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షను పోలీసులు భగం చేయడం అప్రజాస్వామికమనీ, నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని సీఐటీయూ పేర్కొంది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణికి బకాయిపడ్డ రూ.22 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సొంతింటి కల నెరవేర్చడానికి 250 గజాల స్థలం ఇవ్వాలని, కాలం చెల్లిన క్వార్టర్ల స్థానంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలనీ, జీఓ.నెం 22 ను గెజిట్ చేయాలని డిమాండ్ చేశారు. శుభ్రమైన తాగునీరందించాలనీ, పెండింగులో ఉన్న 12 డిమాండ్లను పరిష్కారం చేయా లని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోకుండా తక్షణమే పోరాటంలో వున్న నాయకులు చర్చలకు ఆహ్వానించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.