Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధులు బహిష్కరించి 'భగీరథ' కార్మికుల నిరసన
నవతెలంగాణ-వైరా
విషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరాలో కార్మికులు విధులు బహిష్కరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి తమ సమస్యలపై వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మద్దెల రవి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా మిషన్ భగీరథలో పనిచేస్తున్న 571 మంది కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, లేకపోతే సమ్మెకు వెళతామని హెచ్చరించారు. కాగా, కార్మికుల సమ్మెతో జిల్లాలోని 18 మండలాల పరిధిలోని 849 గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా బుధవారం నుంచి నిలిచిపోయింది. కార్యక్రమంలో సబ్ డివిజన్ అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి ఓర్సు రవి, రామ క్రిష్ణ, మర్సకంట్ల రవి, సుమన్, చింతకాని చారి తదితరులు పాల్గొన్నారు.