Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 మంది విద్యార్థులకు అస్వస్థత
నవతెలంగాణ-కమలాపూర్
ఎంజేపీలో ఫుడ్పాయిజన్ అయి ఎనిమిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఎంజేపీ బాలికల గురుకులంలో బుధవారం జరిగింది. వాంతులు, విరోచనాలు కడుపు నొప్పి రావడంతో ఉపాధ్యాయులు గమనించి స్థానిక ఆస్పత్రికి విద్యార్థులను తరలించారు. వారిని స్థానిక తహసీల్దార్ రాణి, సీఐ సంజీవ్ పరామర్శించారు. గతంలో ఇక్కడి బాలుర గురుకులంలో నాణ్యత లోపంతో విద్యార్థులు ఇబ్భంది పడగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు పర్యవేక్షించి ఫుడ్ విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు. అయినా తీరు మారకపోవడంతో ఘటన మళ్లీ చోటుచేసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు.
అడిగితే బెదిరిస్తున్నారు : అక్షర, విద్యార్థిని
భోజనంలో పురుగులు వస్తున్నాయి. బియ్యంలో పురుగులు రాకుండా పౌడర్లు కలుపుతున్నారు. వంటవాళ్ళు బియ్యాన్ని సరిగ్గా కడగడం లేదు. కూరగాయలు కూడా కడగకుండానే వండుతున్నారు. ఇదేంటి అని అడిగితే మమ్మల్నే బెదిరిస్తున్నారు. ఈ విషయం ఎవరికి చెప్పినా మా స్కూల్ పరువు పోతుందని, ఎవరికీ చెప్పొద్దంటూ టీచర్లు బెదిరిస్తున్నారు. ఎవరికైనా చెబితే మమ్మల్ని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ వల్లే విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయ్యాయి. కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు.