Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం
నవతెలంగాణ-కల్చరల్
మూడు దశాబ్దాల కిందటి నుంచి అనుసరిస్తున్న విద్యావిధానాన్ని నేటి ఆధునిక కాలానికి అనుగుణం గా మార్పులు చేసి జాతీయ విధానం 2020 రూపకల్పన చేశారని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. నూతన విద్యా విధానం ద్వారా పాఠ్యగ్రంథంలో ఉన్న అంశాలను ప్రయోగాత్మ కంగా అభ్యసించడం, విద్యార్థి సమగ్రాభివృద్ధికి దోహ దపడుతుందని అన్నారు. బుధవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకో త్సవం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్యకు గౌరవ డాక్టరేట్ పట్టా, వివిధ అంశాల్లో ఎంఫీల్, పీహెచ్డీ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు స్వర్ణ పతకాలను గవర్నర్ అందజేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగి స్తూ.. ఇంజినీరింగ్ లేదా వైద్య విద్యనే కాకుండా విద్యార్థులు భాషా, కళలు వంటి అంశాలను ఎంచు కొని విద్యనభ్యసించటం సంతోషకరమన్నారు. దేశంలో మాతృభాషలో విద్యా బోధన చేస్తూ.. న్యాక్ గుర్తింపు పొందిన అతి కొన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు యూనివర్సిటీ ఒకటి అని తెలిపారు. పట్టాలు పొందిన విద్యార్థులు సమాజంలోని సవాళ్లను ఎదుర్కొంటూ మన జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికీ ఒక తత్వం ఉంటుందని, దాని ఆధారంగానే పలు వాదాలు తెలుగు సాహిత్యం లో వచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్యులు కిషన్‌రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ నివేదిక సమర్పిం చారు. ఈఏడాది నుంచి 19 విభిన్న కోర్సులు ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
స్నాతకోత్సవంలో ఆంగ్లం
నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుభాష సంస్కృతి కళల వికాసం లక్ష్యంగా తెలుగు వారి ఆత్మ గౌరవ సూచికగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే, 15వ స్నాతకోత్సవంలో దాదాపు విధానపర ప్రకటనలు, విద్యార్థుల ప్రమాణస్వీకారం ఆంగ్ల భాషలోనే జరిగాయి. తెలుగు విశ్వవిద్యాల యం పేరుకు మాత్రమేనా.. అవసరం లేకున్నా ఆంగ్లం ఎందుకు వాడుతున్నారని ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగులో పట్టా ప్రదాన ప్రకటన రూపొందించుకోకుండా ఆంగ్ల సంప్రదా యం కొనసాగించడాన్ని తప్పుపట్టారు.