Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా 3వ మహాసభ బుధవారం గోల్కోండ క్రాస్‌రోడ్డులో ఆర్.వాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. నిరుపేదలు ఉపయోగించే నిత్యావసర సరు కులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధించి.. ప్రజల నోటికాడి ముద్దను దూరం చేసిందన్నారు. గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలను పెంచిందని విమర్శిం చారు. 29 కార్మిక చట్టాలను మార్చి కార్మికులకు నష్టం కల్గించేవిధంగా నాలుగు లేబర్‌కోడ్‌లుగా చేసి 8గంటల పని విధానాన్ని 12గంటలకు పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ లోపాలను సరిచేసి పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిం చాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని, మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ.. పెరిగిన ధరలకనుగుణంగా మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.25లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ మహాసభలో సీఐటీయూ నాయకులు సి.మల్లేష్, జి.రాములు, పి.పుల్లారావు, టి.మహేందర్, యాదమ్మ, రేణుక, ఎల్లమ్మ, లక్ష్మిబాయి పాల్గొన్నారు.