Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలపై పోరాడాలని బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఎన్ ఆజాద్ పిలుపునిచ్చారు. విద్యారంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. మార్పుల పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యావ్యాపారీకరణ, ప్రయివేటీకరణ, కేంద్రీకరణ, కాషాయీకరణను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. అందులో భాగంగానే జాతీయ విద్యావిధానాన్ని తెచ్చిందని పేర్కొన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలు చేసేలా ఉందని విమర్శించారు.ఆరు నుంచి ఒకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టి వి ద్యార్థులను విజ్ఞానవంతులుగా కాకుండా దేశీయ, విదేశీ కార్పొరేట్ సంస్థ లకు అవసరమైన కార్మికులను తయారు చేసేలా నూతన జాతీయ విద్యావి ధానం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యా ర్థులకు పాఠ్యపుస్తకాలు,యూనిఫారాలు అందించాలని డిమాండ్ చేశారు.