Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ దూరవిద్య ఫలితాలను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పివి శ్రీహరి గురువారం విడుదల చేశారు. పదో తరగతికి 31,720 మంది పరీక్షలు రాయగా, 16,481 (51.96 శాతం) మంది పాసయ్యారని వివరించారు. ఇంటర్మీడియెట్‌కు సంబంధించి 36,345 మంది పరీక్షలు రాస్తే, 14,910 (41.02 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు ఈనెల 26 నుంచి వచ్చేనెల ఐదో తేదీ వరకు దరఖాస్తు చేయొచ్చని సూచించారు. ఫలితాల కోసం www.telanganaopenschool.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.