Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
104 ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీసెస్ (ఎఫ్డీహెచ్ఎస్) ఉద్యోగులకు బకాయిఫడ్డ వేతనాలు చెల్లించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్ఇయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్, కె.యాదానాయక్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతామహంతికి గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సేవల్లో ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డీఇవోలు, డ్రైవర్లు, ఏఎన్ఎంలు, సెక్యూరిటీ గార్డులు దాదాపు 1,300 మంది 15 ఏండ్లుగా పని చేస్తున్నారని తెలిపారు. 2012 నుంచి వీరంతా ప్రభుత్వ అధీనంలో విధులు నిర్వహిస్తున్నారనీ, ఈ సేవలను ప్రభుత్వం 2021 డిసెంబర్ నుంచి నిలిపేసిందని పేర్కొన్నారు. 2022 ఏప్రిల్ నుంచి జులై వరకు నాలుగు మాసాలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బదిలీలకు అవకాశం కల్పించాలి
104 ఉద్యోగులను ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నియమించారని భూపాల్, యాదానాయక్ తెలిపారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో వారిని సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 104 సేవలు రద్దయితే స్పష్టమైన విధి విధానాలు, పని గురించి మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. రెగ్యులర్ పోస్టుల నియామకాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు.