Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11,680 మంది దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2022-24 బ్యాచ్ ప్రవేశాల కోసం శనివారం డీసెట్ రాతపరీక్ష జరగనుంది. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు మాధ్యమానికి 4,967 మంది, ఆంగ్ల మాధ్యమానికి 5,348 మంది, ఉర్దూ మాధ్యమానికి 1,365 మంది కలిపి మొత్తం 11,680 మంది దరఖాస్తు చేశారని వివరించారు. శనివారం తెలుగు మాధ్యమం విద్యార్థులకు మొదటి విడత ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల విద్యార్థులకు రెండో విడత మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. తెలుగు మాధ్యమం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8.30 గంటల నుంచి, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమం విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని వివరించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు.