Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబోరేటరీలు, ఫుడ్ (హెల్త్) విభాగంలో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రాజేంద్రన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా ఈనెల 29 నుంచి వచ్చేనెల 26 వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.