Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కారుణ్య నియామకాల్లో యాజమాన్యం కరుణ లేకుండా వ్యవహరిస్తున్నదని ఆర్టీసీ జేఏసీ చైర్మెన్ కె రాజిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1978 ఎంప్లాయీస్ యూనియన్ యాజమాన్య ఒప్పందం ప్రకారం చనిపోయిన కార్మికుని కుటుంబ సభ్యులకు రెగ్యులర్ ప్రాతిపదికన నియామాకాలు చేయాలని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పద్దతిలో నియామకాలు జరిగాయని పేర్కొన్నారు. .కానీ.. 2022లో యాజమాన్యం ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తూ ఈ స్కీంలో ఇప్పటి నుంచి ఇచ్చే ఉద్యోగాలను కన్సాలిడేటెడ్ పే ఇస్తూ నియామకాలు చేస్తామని పేర్కొన్నారు. అప్పట్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియామాకాలు జరిగితే.. ఇప్పుడు మూడేండ్ల తర్వాత ప్రతి ఏడాది 240 రోజుల హాజరు ఉండాలి, ఎటువంటి క్రమశిక్షణా చర్యలు లేకుండా క్లీన్ రికార్డు ఉండి నైపుణ్యం అసెస్మెంట్ టెస్టులో 60శాతం మార్కులు వఛ్చి ఉంటేనే వేకేన్సి ఫోజిషన్ను బట్టి రెగ్యులర్ అవుతారు.ఈ పద్దతిలో రెగ్యులర్ కావడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.