Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్పర్సన్, సభ్యులను వెంటనే నియమించాలని సీఎం కేసీఆర్‌ను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక లేఖ రాశారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కలెక్టర్లకు విస్తృత అధికారాలున్నాయని తెలిపారు. అందులోని సెక్షన్ 37 ప్రకారం సర్పంచ్‌లు సర్కారు నిర్దేశించిన పనుల్లో ఏవైనా చేయకపోయినా, ఇతరత్రా కారణాలతో వారిని కలెక్టర్లు తప్పిస్తున్నారని పేర్కొన్నారు. అన్యాయానికి గురైన సర్పంచ్‌లు ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేయడానికి చట్టంలో వెసులుబాటు ఉందనీ, అది ప్రస్తుతం పనిలో లేదని తెలిపారు. పంచాయతీలో సరిగా నిధులు లేకపోయినా పై అధికారుల ఒత్తిడితో సర్పంచులు పనిచేయాల్సిన వస్తున్నదని వివరించారు. ట్రిబ్యునల్ అరకొర సిబ్బందితో పనిచేస్తున్నదని తెలిపారు. అందులో సర్పంచ్ అప్పీల్ చేయాలంటే రూ.25,000 ఫీజు చెల్లించాల్సి రావడంతో కొందరు సర్పంచులు హైకోర్టును ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే ట్రిబ్యునల్ చైర్‌పర్సన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించాలనీ, అప్పీల్ ఫీజును రూ.25 వేల నుంచి వెయ్యి రూపాయలకు తగ్గించాలని కోరారు.