Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తం 43 మందికి పాజిటివ్
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మరో 13 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయిందని ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, పీహెచ్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. పాఠశాలలో మొత్తం 560 మంది విద్యార్థులు ఉండగా, అందులో బుధవారం ఉదయం నలుగురు విద్యార్థులకు జ్వరం రావడంతో వారిని వైద్య పరీక్షల కోసం స్థానిక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో ఇద్దరి విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు. బుధవారం మొత్తం పాఠశాలలో 150మంది విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 29 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్దారణ అయినట్టు చెప్పారు. అదేవిధంగా గురువారం వైద్య సిబ్బంది పాఠశాలలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మరో వంద మంది విద్యార్థులకు టెస్టు నిర్వహించగా, ఇందులో మరో 13 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. పాఠశాలలో మొత్తం 43 మంది విద్యార్థులకు కోవిడ్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని ప్రిన్సిపాల్ తెలిపారు. వీరందరి తల్లిదండ్రులకు సమాచారం అందించి వారివారి ఇండ్లకు పంపించారు.