Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏ జేఏసీ నాయకుల ఆవేదన
- సిరిసిల్లలో దీక్ష చేస్తున్న వీఆర్ఏల అరెస్ట్
- అయినా మంత్రి తప్పని నిరసన సెగ
- కాన్వారు అడ్డగింత
- పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేదా అని వీఆర్ఏల జేఏసీ సంఘం నాయకులు ప్రశ్నించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలంటూ మూడ్రోజులుగా జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్నారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కూడా దీక్షాశిబిరం కొనసాగింది. అయితే, శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు వీఆర్ఏలను అరెస్టు చేసి తంగళ్ళపల్లి మండలం తాడూరు హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. అయినా వారి నిరసన సెగ నుంచి మంత్రి తప్పించుకోలేకపోయారు. దీక్షలో ఉన్న వారి అరెస్టు అనంతరం మరి కొంత మంది అక్కడికి చేరుకుని మంత్రి కాన్వరుని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏల జేఏసీ సంఘం కన్వీనర్ చందు, ప్రధాన కార్యదర్శి అర్జున్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనియెడల సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. పోలీసులు అరెస్టు చేసిన వీఆర్ఏలను కాంగ్రెస్ నాయకు లు పరామర్శించారు.
మంత్రి కాన్వారు అడ్డగింత..
సిరిసిల్లలో దీక్షలో ఉన్న వీఆర్ఏలను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. అనంతరం అక్కడికి చేరుకున్న మరికొంత మంది వీఆర్ఏలు మంత్రి కాన్వారుని అడ్డుకొని నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని పక్కకు లాక్కెళ్లారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల దీక్షకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. భువనగిరి జిల్లా కేంద్రంలో వీఆర్ఏల దీక్ష కొనసాగింది. వీఆర్ఏ సంఘం జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ వంగూరి రాములు, వెంకటేశం యాదవ్ మా ట్లాడారు. వీఆర్ఏలకు పే-స్కెల్ జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.