Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పట్ల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై టీఎస్పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్‌అలీ, ప్రధాన కార్యదర్శి పిట్ల రాజయ్య శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. ఆ తీర్పును గౌరవిస్తూ ఉపాధ్యాయులను తిరిగి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో డిప్యూటేషన్‌పై నియమించాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో విద్యావాలంటీర్ల నియమించాలని ప్రభుత్వానికి సూచించారు.