Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అరుణతారను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజ రు కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి హేయనీయమని పేర్కొ న్నారు. జనం గోస- బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలతో గ్రామా ల్లోకి వెళ్తుంటే టీఆర్ఎస్ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. పోలీసులు టీఆరెస్ నేతలకు కొమ్ము కాస్తూ బీజేపీ నేతలను అరెస్ట్ చే యడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలనీ, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎద్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
బండి సంజరు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై హైకోర్టు స్టే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ ఎన్నికల కోడ్ ఉల్లఘించారనే ఆరోపణలపై హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. 2019 జనరల్ ఎలక్షన్ సమయంలో జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజరు, మాజీ మంత్రి బాబు మోహన్ సహా మరో 10 మంది బిజెపి నాయకులపై మల్యాల పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేసిన విషయం విదితమే.
3 కాలేజీల మెడికల్ విద్యార్థులను రీ అలకేట్ చేయించండి
మౌలిక సదుపాయలు, అధ్యాపకులు లేరనే కారణంతో రాష్ట్రంలో గుర్తింపు రద్దు చేసిన ఎమ్ఎన్ఆర్, టీఆర్ఆర్, మహవీర్ మెడికల్ కాలేజీల్లోని వందలాది మంది ఎంబీబీఎస్, పీజీ విద్యార్థుల భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారిందనీ, వారిని వేరే కళాశాలల్లో రీ అలకేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజరుకుమార్ కోరారు.