Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా, గిరిజన, అటవీ రిజర్వేషన్ బిల్లులు ఆమోదించాలని ఆకాంక్ష
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారతదేశ 15 రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీముర్ముకు మంత్రి కే తారకరామారావు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దేశాధ్యక్షురాలిగా ఆమె మహిళా, గిరిజన, అటవీ (ఆర్ఓఎఫ్ఆర్) రిజర్వేషన్ బిల్లుల్ని ఆమోదించాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
ఇంటింటా నూతన ఆవిష్కరణల పోస్టర్ విడుదల
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో ఆగస్టు 15వ తేదీ 33 జిల్లాల్లో నిర్వహించనున్న నూతన ఆవిష్కరణల పోస్టర్ను ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు శుక్రవారంనాడిక్కడ విడుదల చేశారు. దీనికి 'ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శన' అని పేరు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ప్రదర్శనలు జరగుతాయని నిర్వాహకులు తెలిపారు. తమ నూతన ఆవిష్కరణలను ఫోన్నెంబర్ 9100678543కి ఆగస్టు 5వ తేదీలోపు వాట్సప్ చేయాలని కోరారు. ఆమోదం పొందిన ఆవిష్కరణలను స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు.