Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన రాతపరీక్షలు
- 82.46 శాతం మంది హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ రాతపరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈ మేరకు లాసెట్ కన్వీనర్ జిబి రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. లాసెట్ రాతపరీక్షలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. లాసెట్‌కు 35,538 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 28,921 (82.46 శాతం) మంది పరీక్ష రాశారని వివరించారు. ఇందులో మూడేండ్ల లా కోర్సుకు 24,938 మంది దరఖాస్తు చేస్తే 20,107 (80.6 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు. ఐదేండ్ల లా కోర్సుకు 7,506 మంది దరఖాస్తు చేయగా, 6,207 (82.6 శాతం) మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. ఎల్ఎల్ఎంకు 3,094 మంది దరఖాస్తు చేస్తే, 2,607 (84.2 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు. ఈనెల 26న ప్రాథమిక కీని విడుదల చేస్తామని వివరించారు. ఈనెల 28 సాయంత్రం ఐదు గంటల వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు మొదటివారంలో లాసెట్ ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. ఇతర వివరాల కోసం https://lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.