Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు తమిళనాడు సీఎం ఆహ్వానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెన్నైలో నిర్వహిస్తున్న 44 వ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును తమిళనాడు సీఎం ఎమ్కే స్టాలిన్ ఆహ్వానించారు. ఈమేరకు స్టాలిన్ తన పార్టీ రాజ్యసభ సభ్యుడు గిరిజానన్ ద్వారా శుక్రవారం ప్రగతి భవన్‌కు ఆహ్వాన లేఖను పంపించారు. దీనిని తన వ్యక్తిగత ఆహ్వానంగా భావించి 28 జూలై నాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డీఎమ్‌కే ఎంపీ గిరిజానన్, జ్జాపికతో పాటుి ఆహ్వానపత్రికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందచేశారు. జూలై 28 నుంచి 10 అగస్టు వరకు జరిగే చెస్ ఒలింపియాడ్‌లో 188 దేశాల చెస్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీలు భారతదేశంలో మొదటిసారిగా, ఆసియాలో మూడోసారి జరుగుతున్నాయని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.