Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెగా కృష్ణారెడ్డి మౌనమేందుకు?
- టీపీసీసీ అధికార ప్రతినిధి కృష్ణతేజ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టులో బాహుబలిగా బావించే మోటార్లు పంపుహౌజ్‌లో మునిగిపోతే దాన్ని నిర్మించిన మెగా కృష్ణారెడ్డి మౌనంగా ఎందుకు ఉన్నారో చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కృష్ణతేజ ప్రశ్నించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పుకుంటున్న కాళేశ్వరం...చిన్నపాటి వర్షాలకే మోటార్లు ఎందుకు మునిగి పోయాయో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అపార నష్టానికి కారకులెవరో ప్రకటించి, వారి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం అందించాలని కోరారు. ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న కేంద్రం ఎందుక మౌనంగా ఉందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఏడాది మోటార్లను పంప్ హౌస్‌కు సక్సెస్‌గా రన్ చేసిన కొత్త ఆయకట్టుకు మాత్రం నీళ్లు రాలేదని పేర్కొన్నారు. వర్షాల వల్ల ముందు తోడిన నీరంతా దిగువకు వదిలారనీ. గ్రావిటీ మీద వచ్చే శ్రీరామ్ సాగర్ నీళ్లను ఉపయోగించ కుండా ప్రభుత్వం భారీ ఖర్చుతో చేపట్టిందన్నారు.దీంతోకాంట్రాక్టర్లు లాభపడ్డారే తప్పా ప్రజలకు ఉపయోగపడిన దాఖలాలు లేవని తెలిపారు. లోప భూయిస్టమైన డిజైన్ శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మెగా నిర్మాణ కంపెనీకి ఈ ప్రాజెక్టు కల్పతరువుగా మారిందని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఎవరి దగ్గర ఉన్నదో బహిర్గతం చేయాలని కోరారు.