Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు తెలంగాణా రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నుంచి 300 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ విలువ దాదాపు రూ. 500 కోట్లు. మెయిల్ గ్రూపు కంపెనీకి చెందిన ఈవీ ట్రాన్స్‌కు ఈ మేరకు టీఎస్ఆర్టీసీ లెటర్ ఆఫ్ ఆవార్డ్ (ఎల్ఓఏ) అందించినట్టు వివరించింది. కేంద్రప్రభుత్వం ఫేమ్-2 స్కీమ్ కింద 300 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ), అపెక్స్ ప్రాతిపదిక రానున్న 12 ఏండ్లకు ఇచ్చింది. ఈవీ ట్రాన్స్ ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నుంచి కొనుగోలు చేస్తుంది. ఈ బస్సులను వచ్చే 20 నెలల్లో సరఫరా చేస్తారు. ఈ కాంట్రాక్ట్ సమయంలో బస్సుల మెయింటెనెన్స్‌ను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ చేస్తుంది. ఒలెక్ట్రా, ఈవీ ట్రాన్స్‌ల మధ్య జరిగే లావాదేవీని ఆర్మ్స్లెంథ్ ప్రాతిపదికన జరిగే రిలేటెడ్ పార్ట్ లావాదేవీగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మరో ప్రతిష్టాత్మక ఆర్డర్ రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణా పౌరులకు అత్యాధునిక, కాలుష్యం వెదజల్లని ఎలక్ట్రిక్ బస్సులతో సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఒలెక్ట్రా బస్సులు ఇప్పటికే హైదరాబాద్‌లో మూడేండ్లుగా సేవలు అందిస్తూ ఎయిర్‌పోర్డ్‌కు ప్రయాణీకులను చేరవేస్తున్నాయని వివరించారు. ఈ బస్సులను సకాలంలో డెలివరీ చేసి పౌరులకు అత్యుత్తమ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. ఈవీ ట్రాన్స్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఇప్పటికే దేశంలోని పూణే, ముంబరు, గోవా, సూరత్, అహ్మదాబాద్, నాగ్‌పూర్ వంటి వివిధ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు బస్సులను నడుపుతున్నాయని తెలిపారు. టీఎస్ఆర్టీసీకి అందజేసే 12 మీటర్ల నాన్ ఏసీ, లో ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సుల్లో 35 సీట్లతో పాటు డ్రైవర్, వీల్ ఛైర్ వుంటాయనీ, ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ ఎయిర్ సస్పెన్షన్ సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటుకు యూఎస్బీ సాకెట్లు, ఎమర్జెన్సీ బటన్లు ఉంటాయనీ, బస్సులో అమర్చిన లిథియం-అయాన్ బ్యాటరీ ట్రాఫిక్ మరియు ప్రయాణీకుల లోడ్ పరిస్థితులను బట్టి ఒకసారి ఛార్జింగ్ చేస్తే 80 శాతం ఎస్ఓసీ ప్రాతిపదికన 200 కి.మీ.లు ప్రయాణిస్తుందని వివరించారు. బస్సులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉందనీ, దీని వల్ల బ్రేక్స్ వేయడం వల్ల కోల్పోయిన గతిశక్తిలో కొంత భాగాన్ని తిరిగి పొందొచ్చని తెలిపారు. హై-పవర్ డీసీ చార్జింగ్ సిస్టమ్‌తో బ్యాటరీని ఐదు గంటల్లో పూర్తిగా రీఛార్జ్ చేయవచ్చని పేర్కొన్నారు.