Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గజ్వేల్
రింగ్‌రోడ్డు నిర్మాణంతో భూమి కోల్పోయిన ఓ రైతు ఆవేదనతో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ పట్టణానికి చెందిన భూనిర్వాసితుడు చిక్కుడు నరసింహులు (56)కు చెందిన మూడెకరాల భూమి మొత్తాన్ని కొండపోచమ్మ, గజ్వేల్ రింగ్‌రోడ్‌లో కోల్పోయాడు. కానీ ఆ భూమికి 2013 చట్టం ప్రకారం నిర్వాసితునికి ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. దాంతో అటు భూమి కోల్పోయి ఇటు పరిహారం అందక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. భూమికి భూమి ఇవ్వాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయిన నిర్వాసితుడికి ప్రభుత్వం కొంత పరిహారం ఇచ్చినప్పటికీ తన కుటుంబ పోషణకు సరిపోలేదు. దాంతో భవన నిర్మాణ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తనకున్న భూమిని ప్రభుత్వం లాక్కున్నదని, బతుదెరువు బరువవుతుందనీ కుటుంబ సభ్యులతో ఆవేదన వ్యక్తం చేసినట్టు బంధువులు తెలిపారు. మనోవేదనకు గురై నిర్వాసితునికి శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిం చారు. కాగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా కాంగ్రెస్ నాయకులు నాయిని యాదగిరి. గుంటుక శ్రీనివాస్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి, నిర్వాసితుడు నరసింహులు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు. పూర్తిగా భూమి మీద ఆధారపడ్డ నరసింహులు గుండెపోటుతో చనిపోవడంతో అతని కుటుంబం రోడ్డున పడిందని, అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.