Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శంషాబాద్
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో పోలీసులు 4.33కిలోల బంగా రాన్ని శుక్రవారం పట్టుకు న్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి ఇద్దరు స్మగ్లర్లు బంగారాన్ని ఎల్లో మెటల్ కోటింగ్ చేసి దాచుకొని వచ్చారు. పసిగట్టిన ఎయిర్ పోర్టు ఇంటెలిజెన్స్ అధికారులు ఇద్దరు ప్యాసింజర్స్ని అనుమానంతో తనిఖీ చేశారు. వారి వద్ద 3.591 కిలోల బంగారం కనిపించింది. వెంటనే బంగారం స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో ప్రయాణికుడి వద్ద 740 గ్రాముల బంగారం పట్టుకున్నారు. ఎయిర్ పోర్టులో రెండు వేరు వేరు ఘటనల్లో రూ.1.87 కోట్ల విలువైన 4. 33 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ముగ్గురు ప్రయాణికులు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.