Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని నివేదికల్లో రాష్ట్రమే అగ్రగామి: సిరిసిల్ల పర్యటనలో మంత్రి కె.తారకరామారావు
- రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదిముర్ముకు అభినందనలు
నవతెలంగాణ - సిరిసిల్ల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏండ్లలోనే దేశానికే ఆదర్శప్రాయంగా ఎదుగుతుందని, దేశ అభి వృద్ధికి చోదక శక్తిగా ఉన్నం దుకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని నివేదికల్లోనూ తెలంగాణ రాష్ట్రం అగ్రగా మిగా నిలుస్తుందని చెప్పారు. శుక్రవారం ఆయన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించారు. జిల్లా ఆస్పత్రిలో పసిపిల్లల వార్డును ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
నీళ్లు, నిధుల విషయంలో ఇప్పటికే రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించిందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టాప్ టెన్ ఆదర్శ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గ్రామాలే పది ఉండటం మనందరికీ గర్వకారణమని చెప్పారు. ఇలాంటి పురోగమన రాష్ట్రానికి అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతూ, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఎన్నో అవరోధాలను సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతి ప్రజాస్వామ్య వేదికపైనా గళమెత్తుతామని చెప్పారు. కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు కట్టి నీటిగోస తీర్చామని, ఫలితంగా తెలంగాణ.. దేశంలో ధాన్యపు బాండాగారంగా మారిందని అన్నారు.
దేశంలోని 29రాష్ట్రాల్లో తెలంగాణ భౌగోళికంగా 11వ, జనాభాలో 12వ స్థానంలో ఉందని.. కానీ దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉందని వివరించారు. ఎనిమిదేండ్లలో కేంద్రానికి ట్యాక్స్‌ల రూపంలో రూ. 3,65,797 కోట్లు ఇచ్చామని, కేంద్రం నుంచి రూ.1,68,000 కోట్లు తిరిగి తెలంగాణకు వచ్చాయని తెలిపారు. పర్యట నలో భాగంగా సిరిసిల్లలోని బీసి స్టడీ సర్కిల్‌ను మంత్రి సందర్శించి, అభ్యర్థులకు రూ.2 లక్షల విలువైన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు అభినందనలు
దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఆదివాసి మహిళ అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు, అటవీ హక్కుల చట్ట సవరణ బిల్లులు ఆమోదం పొందేలా ఆమె కేంద్రంపై ఒత్తిడి తెస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.