Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సెల్ఫోన్లకు వచ్చే తప్పుడు మెసేజ్‌లకు స్పందించొద్దని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి శుక్రవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. తన ఫోటోను ఓ ఆగంతకుడు వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకుని, వాట్సాప్ ద్వారా సంస్థ ఉద్యోగులు, ఇతర అధికారులకు మెసేజ్ లు పంపుతున్నాడని తెలిపారు. ఈ మెసేజ్‌లకు, ఆగంతకుడు వాడే మొబైల్ నెంబర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరించారు. వేర్వేరు ఫోన్ నెంబర్ల్ల ద్వారా మెసేజ్‌లు పంపి డబ్బులు, ఇతర ప్రయోజనాలు కోరే అవకాశమున్నదని తెలిపారు. ఆ మెసేజ్‌లను ఎవరూ నమ్మొద్దనీ, అలాంటి వాటికి స్పందించొద్దని విజ్ఞప్తి చేశారు.