Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలంలో కేంద్ర బృందం విస్తృత పర్యటన
- దెబ్బతిన్న పంట పొలాలు..వరద ముంపు ప్రాంతాల పరిశీలన
నవతెలంగాణ-బూర్గంపాడు
గోదావరి భారీ వరదలతో దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రహదారులు, మిషన్ భగీరథతో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి నేతృత్వంలో పార్తిభన్ కె.మనోహరన్, కేంద్ర జలసంఘం డైరెక్టర్ రమేష్‌కుమార్, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఎస్.ఈ.శివకుమార్ కుష్వాహల కేంద్ర బృందం శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే బూర్గంపాడు మండలంలోని సంజీవరెడ్డి పాలెం, బూర్గంపాడు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. సంజీవరెడ్డి పాలెం గ్రామంలో దెబ్బతిన్న పత్తి, డ్రాగేన్ ఫ్రూట్ రైతుల పొలాలు పరిశీలించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడారు. జి భాస్కర్ రెడ్డి అనే రైతు 15 ఎకరాల్లో పత్తి పంట వేశానని వరదల వల్ల పూర్తిగా పాడైపోయినట్టు చెప్పారు. అలాగే యం ఏ మజీద్ అనే రైతు డ్రాగేన్ ఫ్రూట్ పండ్ల తోటను పరిశీలించారు. బూర్గం పాడుగ్రామంలో దెబ్బతిన్న ఇండ్లు, కుక్కునూరు-బూర్గంపాడు రహదారిని పరిశీలించారు. జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి బూర్గంపాడు మేజర్ గ్రామపం చాయతీ సర్పంచ్ సిరిపురపు స్వప్న వివరించారు. అదేవిధంగా భద్రాచలంలో ఐటీడీఏ సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ గోదావరి వరదలకు సంబంధించి, నష్టాలను గురించి వారికి వివరించారు. పర్యటనలో రాష్ట పంచాయతీ రాజ్ డైరెక్టర్ హనుమంత రావు, ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, ఐటీడీఏ పీఓ పోట్రూ గౌతం, ఎఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా వ్యవసాయ అధికారి అభిమా న్యుడు, ఉద్యావన అధికారి మరియన్న, రభ ఈఈ భీంలా, పీఆర్ ఈఈ సుధాకర్, మిషన్ భగీరథ ఎస్ ఈఎస్ భాస్కర రావు, ఈఈ తిరుమలేష్, నళిని, విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్, డీఈ విజరు కుమార్, జాతీయ రహదారుల డీఈ శైలజ, డిఆర్వో అశోక్ చక్రవర్తి పాల్గొన్నారు.