Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహిస్తాం : తలసాని సాయికిరణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం నగరంలోని అనాథలకు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్టు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కూడా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ భవన్లో ఉదయం 9.30 గంటల నుంచి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ప్రారంభ మవుతాయని చెప్పారు. నేటి యువతకు ఆయన స్ఫూర్తిదాయకమన్నారు. ది లీడర్ ఫ్రం లోకల్ టూ గ్లోబల్ పేరుతో మంత్రి కేటీఆర్ అంచెలంచెలుగా ఎదిగిన తీరును ఐదారు నిమిషాల నిడివితో రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని వివరించారు. అదేవిధంగా సాండ్ ఆర్ట్, త్రీడీ వాల్ ఏర్పాటు చేశామన్నారు. రైజ్ ఆఫ్ తెలంగాణ పేరుతో కేక్ కట్ చేస్తామని చెప్పారు. కేక్ కటింగ్ చేసే ప్రాంతంలో త్రీడీ గ్రాఫిక్స్ లో కాలేశ్వరం, దుర్గం చెరువు ప్రదర్శన ఉంటుందని అన్నారు. కేటీఆర్కు కళాకారులతో ఘనస్వాగతం పలుకుతామన్నారు. మంత్రి కేటీఆర్కు దీవెనలు ఇవ్వాలని కోరుతూ 116 ఆలయాల్లో పూజలు చేస్తామన్నారు.