Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దలను జాగ్రత్తగా చూసుకోవటం మన విధి : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత మాత్రమే కాదు.. అది మన విధి కూడా...' అని రాష్ట్ర మంత్రి కేటీఆర్... రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. సీనియర్ సిటిజన్లకు ప్రయాణాల్లో ఇచ్చే రాయితీని ఎత్తేస్తున్నట్టు రైల్వేశాఖ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. కేంద్రం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరారు. మరోవైపు సీఎం కేసీఆర్‌కు ఈడీ విచారణ తప్పదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు వ్యాఖ్యానించటంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పీఎంవోను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేస్తూ 'బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ (బండి సంజరు) కుమార్‌ను ఈడీ చీఫ్‌గానూ నియమించినం దుకు ధన్యవాదాలు. దేశాన్ని నడిపిస్తున్న డబుల్ ఇంజిన్ 'మోదీ-ఈడీ' అనే విషయం దీంతో అర్థమవుతోంది...' అని పేర్కొన్నారు.