Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓపెన్ కరాటే ఛాంపియన్ కుమారి సలోమి ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం దక్కించుకుంది. ఆగస్టు 20నుంచి 27 వరకు థాయిలాండ్లో జరుగనున్న ఆ పోటీలకు వెళ్లనున్న సలోమికి సీపీఐ(ఎం) మేడ్చెల్ జిల్లాలోని కేరళ పార్టీ సభ్యులు సంతోష్, ఉదరు ఆధ్వర్యంలో రూ. 50వేలు, రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులకు హాజరైన మత్స్య కార్మిక సంఘం నాయకులు బుర్రి శ్రీరాములు రూ. 10వేలు, ఎంకెఎంకెఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ, ఇతరులు కలిసి మరో ఐదువేలు, భద్రాచలం నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య వెయ్యి రూపాయలు కలిపి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేతులు మీదుగా శుక్రవారం హైదరాబాద్లో అందజేశారు. ఈ సందర్భంగా తమ్మినేని సలోమికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో జరిగే అంతర్జాతీయ పోటీల్లో అనేక బహుమతులు సాధించాలనీ, తద్వారా రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు.ఆర్థిక సహకారాన్ని అందించిన మేడ్చల్ జిల్లా కేరళ పార్టీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సలోమి తండ్రి కురునెల్లి వెంకట్, రాష్ట్ర నాయకులు, బండారు రవికుమార్, మేడ్చల్ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటి రవి, కృష్ణారావు, జిల్లా కమిటీ సభ్యులు పి వెంకట్, కేరళ కార్యకర్తలు సంతోష్, నాయకులు బాలు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.