Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్‌తో ఐఎఫ్బీఏ భాగస్వామ్యం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆరోగ్యవంతమైన భారతావనిని నిర్మించడమే లక్ష్యంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)తో శుక్రవారం ఇండియన్ ఫుడ్ అండ్ బేవరేజ్ ఇండ్రస్టీ అసోసియేషన్ (ఐఎఫ్బీఏ) భాగ స్వామ్యం చేసుకున్నది. ఆహారం, పానీయాల పట్ల ఆరోగ్యవంతమైన ఎంపికలను చేసు కునేలా వినియోగదారులకు అవగాహన కల్పించనుంది. ఆ సంస్థలు ఏకతాటిపైకి రావడంతోపాటుగా ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన, సురక్షిత ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత పట్ల భారతీయ వినియోగ దారులకు అవగాహన కల్పించనున్నాయి. ఈ సంస్థలు ఉమ్మడిగా వెబినార్లు, ప్రాంతీయ వర్క్‌షాప్‌లు నిర్వహించడం ద్వారా మెరుగైన ఆరోగ్యం కోసం ఆహారం వెనుక దాగిన శాస్త్రీయతను అర్థం చేసుకోవడంలో ప్రజలకు సహాయపడనున్నాయి. ఐసీఎంఆర్, ఎన్ఐ ఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత మాట్లాడుతూ న్యూట్రిషన్ సైన్స్‌లో ప్రస్తుత ఆవిష్కరణలు, దేశ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడంతో పాటుగా శాస్త్రీయ సమాజంతో పరిశ్రమల పరిచయం మెరుగుపరిచే దిశగా ఈ భాగ స్వామ్యం ఓ ముందడుగు అని వివరించారు. ఈ సంస్థల భాగస్వామ్యం ద్వారా శాస్త్రీయ, వాస్తవ సమాచారం దేశ వ్యాప్తంగా అందించేందుకు దోహదపడుతుందని చెప్పా రు. చక్కటి నాణ్యత, పరిశుభ్రత, సురక్షిత ఆహారంతో కూడిన వైవిధ్యమైన ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత పట్ల అవగాహన కలుగుతుందని అన్నారు. ఐఎఫ్బీఏ చైర్పర్సన్ దీపక్ జాలీ మాట్లాడుతూ ఎన్‌ఐఎన్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉందన్నారు. న్యూట్రిషన్, డైటెటిక్స్ పరంగా ప్రజారోగ్యం కాపాడటంలో విప్లవాత్మక పరిశోధనలను ఈ సంస్ధ చేసిందని వివరించారు. ప్రాంతాలను బట్టి భారత్‌లో వైవిధ్యమైన ఆహారం కావాల్సి ఉంటుందన్నారు. ఒకటే తరహా ఆహారం అందరికీ అనువుగా ఉండబోదని స్పష్టం చేశారు. అవగాహన, భారతీయ అధ్యయ నాలు, పరిశోధనలపై తగిన విద్య ద్వారా మెరుగైన ఎంపికలను చేసుకోవాల్సి ఉందని చెప్పారు.