Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్‌జోన్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జలశక్తి అభియాన్ కేంద్ర బృందం పర్యటించింది. బృంద సభ్యులు డిఫెన్స్ మంత్రిత్వ శాఖ సంచాలకులు ప్రీతమ్ సింగ్, సీజీ డబ్ల్యూడీ జియో హైడ్రాలజీ శాస్త్రవేత్త సుధీర్ కుమార్ డీఆర్డీఓ శేషాద్రి, అదనపు డీఆర్డీఓ దత్తారాంతో కలిసి పర్యటించారు.
జన్నారం రేంజ్ పరిధిలోని మల్యాల బైసన్‌కుంట, ఇందన్పల్లి రేంజ్ పరిధిలోని, గన్ శెట్టి కుంటలను పరిశీలించారు. అడవిలో నీటి లభ్యత, జీవరాసులకు కావలసిన నీటి వినియోగంపై ఎఫ్డీఓ మాధవరావును అడిగి తెలుసుకున్నారు. అడవిలో సాసర్ వల్ల నిర్మాణం, బోర్వెల్, చెక్ డ్యాములు కుంట లు, వాటిలో నీరు నిలువపై ఆరా తీశారు. నీటి నిల్వతో భూగర్భ జలాలు పెరుగు తాయని తెలిపారు. వారి వెంట ఎంపీడీఓ అరుణారాణి, ఎంపీఈవో రమేష్, ఈజీఎస్ ఏపీఓ రవీందర్, ఎఫ్ఆర్ఓ ఆఫీసొద్దీన్, ఎఫ్ఎస్ఓ శివకుమార్ ఉన్నారు.