Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్వోలంతా ఈ నెల 25 నుంచి విధులకు దూరంగా ఉండబోతున్నట్టు వీఆర్వోల జేఏసీ చైర్మెన్ గోల్కొండ సతీశ్ ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వాసవి భవన్లో వీఆర్వో జేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుధీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో సతీశ్‌తోపాటు జేఏసీ కోచైర్మెన్ జె.రవినాయక్, కన్వీనర్ వింజమూరు ఈశ్వర్, మహిళా కన్వీనర్ సురేశ్ ప్రతిభ, అడిషనల్ సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేశ్, వైస్ చైర్మెన్లు మౌలానా, నూకల శంకర్, రవీందర్, సర్వేశ్వర్, వెంకన్న, మురళి, కార్యనిర్వాహక కార్యదర్శి కృష్ణగౌడ్, సాంస్కృతిక విభాగం కార్యదర్శి రామచంద్రయ్య, అన్ని జిల్లాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. సమావేశ నిర్ణయాలను సతీశ్‌కు మీడియా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వోల పట్ట చిన్నచూపు చూస్తున్నదని వాపోయారు. తమ వ్యవస్థను రద్దు చేయడం సరిగాదనీ, రెవెన్యూలోనే కొనసాగించాలని కోరుతూ కనిపించిన అధికారులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ విధుల్లో పాల్గొనవద్దని సీఎం ఆదేశాలు జారీ చేశారనీ, మరోవైపు తమతో బలవంతంగా పనిచేయిస్తున్నారని తెలిపారు. సర్వీస్ రూల్స్ రూపొందించకుండా, ప్రమోషన్లు ఇవ్వకుం డా, 2019 అపాయింటెడ్ వీఆర్వోల ప్రొబెషనరీ పీరియడ్ డిక్లేర్ చేయకుండా, రాష్ట్రంలో చనిపోయిన 200 మంది వీఆర్వోల కుటుంబాలకు కారుణ్య నియామాకాలు చేపట్టకుండా వేరే శాఖకు బదిలీ అనటం దుర్మార్గమని పేర్కొన్నారు. 5485 మంది వీఆర్వోల కుటుంబాలతో రాష్ట్ర సర్కారు ఆటలాడు కోవడం సబబు కాదని కోరారు. రెవెన్యూ శాఖకు మంత్రి, సీసీఎల్ఏ, ప్రిన్సిపల్ సెక్రటరీలెవ్వరూ లేరనీ, వీఆర్వోల సమస్యలు ఎవరి ద్వారా పరిష్కరించుకోవాలని ప్రశ్నించారు. సీఎస్ అయితే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వాపోయారు. ధరణి లోపాలు సరిచేయకుండా రెవెన్యూ ఉద్యోగుల మీద దాడులు చేయడం అన్యాయమన్నారు.