Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువ రైతు అత్మహత్య
- ఆధారం కోల్పోయిన కుటుంబం
నవతెలంగాణ-నార్నూర్
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం చిత్తగూడకు చెందిన యువరైతు కొడప రాజు(22) శుక్రవారం రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హెచ్‌సి రమేష్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజుకు ఐదెకరాల భూమి ఉంది. తండ్రి లేకపోవడంతో కుటుంబానికి ఆయన పెద్ద దిక్కుగా ఉంటూ వ్యవసాయం చేస్తూ పోషిస్తున్నాడు. ఐదెకరాల్లో పత్తి పంట వేశాడు. భారీ వర్షంతో పైరు దెబ్బతింది. సాగు కోసం చేసిన రూ.లక్షాయాభై వేలు అప్పు ఎలా తీర్చాలని తరచూ స్థానికులతో చెప్తుండేవాడు. తీవ్ర మనస్తాపానికి గురై పురుగులమందు తాగాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రాజు మృతితో తల్లి, ఇద్దరు తమ్ముళ్లు, చెల్లె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గిరిజన సంఘాల నాయకులు సక్కు తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.