Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాతపరీక్షలకు 74 శాతం హాజరు
- కన్వీనర్ శ్రీనివాసాచారి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2022-24 బ్యాచ్ ప్రవేశాల కోసం నిర్వహించిన డీసెట్ రాతపరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు మాధ్యమానికి 4,967 మంది దరఖాస్తు చేయగా, 3,572 (71.91 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని వివరించారు. ఆంగ్లం మాధ్యమానికి 5,348 మంది, ఉర్దూ మాధ్యమానికి 1,365 మంది కలిపి 6,713 మంది దరఖాస్తు చేస్తే 5,073 (75.57 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు. మూడు మాధ్యమాలకు మొత్తం 11,680 మంది దరఖాస్తు చేయగా, 8,645 (74.02 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. పది రోజుల్లో డీసెట్ ఫలితాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 27న ప్రాథమిక కీని విడుదల చేస్తామని తెలిపారు. అభ్యర్థులు www.deecet.cdse.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.