Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 2 నుండి 26వ తేదీ వరకు 24 రోజులు, 5 జిల్లాలు,12 నియోజకవర్గాలు, 328 కి.మీలు మేర సగటున రెండ్రోజులకో అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతారు. యాదాద్రి నుంచి ప్రారంభమై హన్మకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు కొనసాగనుంది. పాల్వాయి రజనీలతో కలిసి పాదయాత్ర ప్రముఖ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జీ మనోహర్ రెడ్డి శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. చారిత్రక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా ఈ పాదయాత్ర సాగుతుందనీ, జనం గోస వింటూ, వారికి భరోసా ఇస్తూ, రాబోయేది బీజేపీ సర్కారేననే సంకేతాలు పంపడమే ఈ యాత్ర లక్ష్యంమని వారు తెలిపారు.