Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యాజేఏసీ చైర్మెన్ మధుసూదన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,392 జూనియర్ అధ్యాపకుల (జేఎల్) పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తప్పులతడకగా ఉన్నాయని ఇంటర్ విద్యాజేఏసీ చైర్మెన్ పి మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. ఉత్తర్వుల్లో హిస్టరీ, సివిక్స్ పేరుతో 23 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి సర్వీసు నిబంధనలుగానీ, గతంలో ఈ సబ్జెక్టు పేరుమీద నియామకాలుగానీ జరిపిన పరిస్థితుల్లేవని పేర్కొన్నారు. పొరపాటున ఈ ఉత్తర్వులు విడుదల చేశారని తెలిపారు. దీనివల్ల నిరుద్యోగుల్లో పెద్దఎత్తున ఆందోళన నెలకొందని వివరించారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వడంతోపాటు బాధ్యులైన అధికారులపైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.