Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారీ వర్షాలు, వరదల వల్ల ఎక్కడా ప్రాణనష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా కలెక్టర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై విపత్తుల నిర్వ హణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జతో కలిసి సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరుసగా రెండు రోజులు సెలవు వస్తున్నందున, వీటిని ఉపయోగించుకోకుండా పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. పొరుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో వరదలు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అన్ని రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండియాని తెలిపారు.